Sunday, April 28, 2024

ఓహ్.. ద గర్ల్ ఈజ్ ఆన్ ఫైర్.. వింటర్లో హీటెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ..

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. తను చేసింది తక్కువ సినిమాల్లో అయినా.. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సైఫ్ అలీ ఖాన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్‏గా తనకంటూ స్పెషల్ స్టేటస్ సంపాదించుకుంది.

కేదర్ నాథ్ మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన సారా.. మొదటి సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా.. తన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆ తర్వాత రణవీర్ సింగ్‏తో కలిసి నటించిన సింబా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఈ అమ్ముడుకి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది.

ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటోంది సారా అలీ ఖాన్. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో తరచూ ఇంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్‌గా త‌ను బికినీలో ఉన్న ఫొటోలను ట్విట్ట‌ర్‌లో పోస్ చేయ‌డంతో అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. చ‌లికాలంలో హీటెక్కించేలా ఉన్న ఈ ఫొటోల‌ను చూసి చాలామంది కామెంట్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement