Friday, May 17, 2024

నేడు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు నోటిఫికేషన్

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ ఈరోజు ప్రారంభంకానుంది. అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ నేడు వెలువడనుంది. ఈ శనివారం నుంచి ఈనెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వచ్చేనెల 1న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చినట్లయితే అక్టోబర్‌ 17న ఓటింగ్‌ నిర్వహించనున్నారు. వచ్చేనెల 19న ఫలితాలను ప్రకటిస్తారు. కాగా, అధ్యక్ష పదవికి ఎవరు పోటీచేస్తున్నారనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ పోటీ పడనున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement