Thursday, March 28, 2024

Live Update | ఆ రైళ్లలో తెలంగాణ వారు లేరు.. ప్రకటించిన ప్రభుత్వం

ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన, మరణించిన వారిలో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులెవరూ లేరని ప్రభుత్వం ఇవ్వాల (శనివారం) తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒడిశా ప్రభుత్వానికి రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలకు తన సహాయాన్ని అందించింది. నిన్న రాత్రి (శుక్రవారం) కోరమాండల్ ఎక్స్ ప్రెస్, SMVT-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 17 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఇది గత 15 సంవత్సరాలలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైల్వే ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో 288 మంది చనిపోయారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి సిగ్నలింగ్ వైఫల్యమే కారణమని ముందుగా చెప్పగా.. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్‌లోకి ప్రవేశించి స్టేషనరీ గూడ్స్ రైలును ఢీకొట్టిందా? లేదా అది మొదట పట్టాలు తప్పి.. ఆగి ఉన్న రైలును ఢీకొట్టిందా! అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని రైల్వే అధికారులు తెలిపారు.

అంతకుముందు రైలు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటనగా పేర్కొంటూ, ప్రాణ నష్టం, గాయపడిన వారి పట్ల విచారం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ అమలు చేసిన యాంటీ-కొలిజన్ పరికరాల సామర్థ్యాన్ని మంత్రి కేటీ రామారావు ఒక ట్వీట్‌లో ప్రశ్నించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement