Friday, June 14, 2024

రెండు నెలల్లో రూ.32,363 కోట్ల ఆర్థిక లోటు

అమరావతి : ఆంధ్రప్రభ : ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు నెలల్లో రూ.32,363 కోట్లు లోటు ఏర్పడింది. మే నెల్లో మొత్తం ఆదాయం రూ.6,386 కోట్లు కాగా, వ్యయం రూ.26,576 కోట్లు-గా నమోదుకావడంతో రూ.20,190 కోట్లు లోటుగా లెక్కలు తేలాయి. ఈ లోటును బహిరంగ మార్కెట్‌ రుణాల ద్వారా సేకరిరచిన దాదాపు రూ.15 వేలకోట్లతో, ఇతర సంస్థల నుంచి సేకరించిన మరో రూ.5 వేలకోట్లతో కలిపి భర్తీ చేసింది. గతంలో రూ.15 వేలకోట్ల నుంచి రూ.20 వేలకోట్ల వరకు లోటు కనిపిరచినా, రూ.30 వేలకోట్లు దాటడం ఇదే మొదటిసారి అని అధికారులు అంటున్నారు. తొలి రెరడు నెలల్లో అనుకున్న ఆదాయం తగ్గడమే ఇందుకు ఇరదుకు కారణంగా చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement