Tuesday, May 7, 2024

Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధర

పసిడి ప్రియులకు స్వల్ప ఊరట. నేడు బంగారం ధర స్థిరంగా కొనసాగింది. నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఈరోజు స్థిరంగా ఉంది. పసిడి రేటులో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. అయితే, వెండి ధర మాత్రం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. పసిడి రేటు రూ. 52,580 వద్దనే కొనసాగుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200 వద్ద స్థిరంగా ఉంది. బంగారం ధరలు నిలకడగా ఉంటే.. వెండి రేటు మాత్రం రూ.500 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 74,600కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement