Sunday, May 5, 2024

Breaking: డ్ర‌గ్స్ కేసులో నిహారిక పేరు.. 37వ నెంబ‌ర్‌గా చేర్చిన పోలీసులు

హైద‌రాబాద్‌లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ వ్యవహారంలో పోలీసుల విచారణ వేగంగా సాగుతోంది. ఆ పార్టీకి హాజరైన లిస్టులో మార్పులు, చేర్పులు చేశారు పోలీసులు. కాగా, లిస్టులో 37వ నెంబర్‌గా కొణిదెల నిహారిక పేరు చేర్చిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 38వ నెంబర్‌గా మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమార్తె పేరు కూడా ఎంట్రీ చేశారు. ఇక‌ పబ్‌లో 145 మంది వివరాలు సేకరించినట్లుగా పోలీసులు తెలిపారు. వీరిలో వీఐపీలు, సెలబ్రిటీలకు సంబంధించి 125 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరితో పాటు 20మంది పబ్‌ స్టాఫ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement