Tuesday, May 7, 2024

పంజాబ్ స‌ర్కార్ కు ఎన్జీటీ రూ.2వేల కోట్ల జ‌రిమానా..

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (NGT) పంజాబ్‌ ప్రభుత్వంపై కొరడా ఝలిపించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పెద్దమొత్తంలో జరిమానా విధించింది. రాష్ట్రాల్లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబధనలు, నీటి చట్టాల అమలును ఎన్జీటీ 2018 నుంచి పర్యవేక్షిస్తున్నది. మున్సిపల్‌ వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం గత కొన్నేండ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ రూ.2080 కోట్లు ఫైన్‌ వేసింది.

గత మూడు వారాల్లో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ జరిమానా విధించింది. వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానాలను అమలు చేయడంలో విఫలమైనందుకు రాజస్థాన్ ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లు, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడంతో మహారాష్ట్రపై రూ.12 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి రూ.3,500 కోట్ల జరిమానా విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement