Thursday, May 16, 2024

పంజాబ్‌లో సంచలనం.. కేబినెట్ ప్రమాణస్వీకారం రోజే 25వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

పంజాబ్లో కొత్తగా ఏర్పాటైన ఆప్ ప్రభుత్వం.. తన కేబినెట్ మంత్రులతో ఇవ్వాల ప్రమాణ స్వీకారం చేయించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని మంత్రివర్గం తొలి సారి భేటీ అయిన సందర్భంగా రాష్ట్ర శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో 25,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల లోపే 25,000 ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్‌ను ఆమోదించి సంచలనం సృష్టించింది. ఎన్నికలకు ముందు తాము వాగ్దానం చేసినట్లుగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు అనేది.. AAP ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా ఉంటుందని భగవంత్ మాన్ ఒక ట్వీట్‌లో తెలిపారు.

శనివారం చండీగఢ్‌లో పంజాబ్ కేబినెట్‌లో ఒక మహిళతో సహా 10 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. పంజాబ్ రాజ్ భవన్‌లోని గురునానక్ దేవ్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ 10 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. వీరంతా పంజాబీలో ప్రమాణం చేశారు. హర్పాల్ సింగ్ చీమా, గుర్మీత్ సింగ్ మీట్ హేయర్ మినహా మరో ఎనిమిది మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయినవారే కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement