Friday, April 26, 2024

న్యూ ఇయర్ వేళ..బంగారం.. వెండి ధరలు

కొత్త సంవత్సరంలో బంగారం..వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు తులానికి రూ.250 మేర పెరిగి.. రూ.50 వేల 600 మార్కుకు చేరింది. ఇక ఇదే 24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే రూ.270 మేర పెరిగి రూ.55,200 మార్కుకు పెరిగింది. అంతకుముందు రోజు కూడా గోల్డ్ రేటు వరుసగా రూ.270, 300 మేర పెరిగింది. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో గోల్డ్ రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. దేశ రాజధానిలో గోల్డ్ రేటు రూ.250 ఎగబాకి ప్రస్తుతం తులానికి 22 క్యారెట్ల ధర రూ.50,750 వద్ద ఉంది. ఇక ఇదే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే రూ.55,350కి పెరిగింది. బంగారం ధర పెరిగిన వేళ సిల్వర్ రేటు మాత్రం హైదరాబాద్‌లో కాస్త తగ్గింది.

ఇక్కడ కిలో వెండి ధర రూ.200 మేర తగ్గి.. రూ.74,300కు పడిపోయింది. అంతకుముందు వరుసగా పెరుగుకుంటూ పోయాయి. దిల్లీలో మాత్రం వెండి రేటు ప్రస్తుతం రూ.71,300 వద్ద స్థిరంగా ఉంది. అంతకుముందు రోజు రూ.1000 మేర పెరిగింది. ఇటీవల యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన వేళ కూడా బంగారం, వెండి ధరలు తగ్గలేదు. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోతుంటాయి. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఇంకా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement