Friday, April 26, 2024

Covdi variant: వెలుగులోకి కొత్త రకం వేరియంట్.. వారికి పరీక్షలు తప్పనిసరి!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. నిత్యం కొత్త కొత్త రూపాలు మార్చుకుంటూ మరింత కలవరపెడుతోంది. మహమ్మారి విజృంభణతో పలు దేశాలు లాక్‌డౌన్‌ కూడా విధిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో పలు రకాల కొత్త వేరియంట్లు బయటపడగా.. తాజాగా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్‌లో కొత్తరకం వేరియంట్ వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మూడు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులకు తప్పనిసరిగా స్క్రీనింగ్‌, కొవిడ్‌ పరీక్షలు పకడ్బందీగా చేయాలని ఆదేశించింది. దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్‌ నుంచి వచ్చేవారిపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

దక్షిణాఫ్రికాలో గుర్తించిన B.1.1529 కొత్త వేరియంట్‌ అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురవుతోంది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే 22 కేసులను గుర్తించినట్లు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం (NICD) వెల్లడించింది. ఈ వేరియంట్ కేసులు బోట్సవానాలో మూడు, హాంకాంగ్‌లో ఒకటి ఇప్పటి వరకూ గుర్తించారు. అసాధారణంగా మ్యుటేషన్‌కు గురవుతున్న ఈ వేరియంట్ దేశంలోని ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా వీసా నిబంధనలు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. దక్షిణాఫ్రికా, హాంకాంగ్‌ నుంచి వచ్చే వారిపట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కేంద్ర రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement