Tuesday, April 16, 2024

మేజ‌ర్ నుండి లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేసిన ‘మ‌హేశ్ బాబు’

డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్ తిక్క డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన చిత్రం మేజ‌ర్. ఈ చిత్రంలో హీరో అడ‌వి శేషు న‌టించాడు. బాలీవుడ్ బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ టాలీవుడ్ కి ప‌రిచ‌యం కానుంది. ఇక శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని స‌మకూర్చారు. ఈ చిత్రానికి సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు నిర్మాత‌. ఈ చిత్రం నుండి మ‌హేశ్ బాబు చేతుల మీదుగా లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. నిన్నే కోరే నే నిన్నే కోరే .. ఆపేదెలా నీ చూపునే, లేనే లేనే నే నువ్వై నేనే .. దారే మారే నీ వైపునే ..’ అంటూ మొదలైన ఈ పాట, ‘హృదయమా .. వినవే హృదయమా” అంటూ సాగుతోంది. హీరో హీరోయిన్ మధ్య అనుభవాలు .. అనుభూతులు .. జ్ఞాపకాలకి సంబంధించిన విజువల్స్ పై ఈ సాంగ్ ను కట్ చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement