Friday, May 3, 2024

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన ‘ముమైత్ ఖాన్’ – కంటెస్టెంట్స్ గురించి ఏం చెప్పిందంటే

ఓటీటీ బిగ్ బాస్ తొలి వారాన్ని పూర్తి చేసుకుంది. కాగా ఫ‌స్ట్ వీక్ లో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. వారియర్‏గా బిగ్‏బాస్ హౌస్‏లోకి ఎంట్రీ ఇచ్చిన ముమైత్ అనుహ్యంగా ఫస్ట్ వీక్‏లోనే బయటకు వచ్చేసింది. అయితే ముందు సీజన్లకు నిర్వహించినట్టుగానే బిగ్‏బాస్ నాన్ స్టాప్ షోకు కూడా బజ్ నిర్వహిస్తున్నారు నిర్వాహాకులు.. ఈ బిగ్‏బాస్ నాన్ స్టాప్ బజ్ షోకు యాంకర్ రవి హోస్ట్‎గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ముమైత్ ఎపిసోడ్‏ను రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇందులో హీరోయిన్ బిందుమాధవి.. యాంకర్ శివ.. ఆర్జే చైతూ పై ఆసక్తికర వాఖ్యలు చేసింది ముమైత్.. హీరోయిన్ బిందు మాధ‌విని నాగినితో పోల్చింది. తాను కాలుక్యూలేషన్ చేసుకున్నాక గేమ్ ఆడుతుందని.. ఎంతో జాగ్రత్తగా ఉంటుందని వెల్ల‌డించింది. అలాగే సరయుకు మహానటి ట్యాగ్ ఇచ్చింది. శ్రీరాపాకకు పొగరు అని చెబుతు.. అజయ్ మంచి మనసు ఉన్నవాడంటూ అతనికి లవ్ సింబర్ ఇచ్చేసింది. ఇక ఆర్జే చైతూ చాలా ఫేక్ అని.. తన తర్వాత ఆర్జే చైతూ ఎలిమినేట్ కాబోతున్నాడంటూ చెప్పింది. తాను ఎలిమినేట్ కావడం వల్లే యాంకర్ శివ, ఆర్జే చైతూ.. బిందు మాదవి, శ్రీరాపాకలు ఆనందంగా ఉన్నారని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement