Thursday, April 25, 2024

Breaking: ఢిల్లీపై ముంబై విజయం.. ఢిల్లీ ప్లే ఆఫ్​ ఆశలపై నీళ్లు

ముంబైతో జరుగుతున్న కీలక మ్యాచ్లో ఢిల్లీ బోల్తా కొట్టింది. విజయం సాధించాల్సిన మ్యాచ్​లో ఓటమితో ప్లే ఆఫ్స్​ ఆశలు గల్లంతైనట్టే తెలుస్తోంది. ముంబే గెలుపుతో బెంగళూరుకు ప్లే ఆఫ్స్​ కు వెళ్లడం ఈజీగా మారిందని చెప్పవచ్చు. నెట్ రన్ రేట్ పరిశీలనలోకి తీసుకుంటే ఢిల్లీ కంటే బెంగళూరు తక్కువ ఉంటుంది. అయితే లక్ష్య ఛేదనలో ముంబై 5వ ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ వికెట్ కోల్పోయింది. 25 పరుగుల స్కోరు వద్ద వికెట్ కోల్పోవడంతో ముంబై అభిమానులు నిరాశకు గురయ్యారు. అయినా.. ముంబై ప్లేయర్లు దీటుగా ఆడి ఢిల్లీ ఆశలను గల్లంతు చేశారు. 5 వికెట్ల విజయాన్ని సాధించారు.

కాగా, ముంబై ఇండియ‌న్స్ ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిలిపింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఏడు వికెట్లు కోల్పోయి 159 ప‌రుగులు చేసింది. ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ) బౌల‌ర్లు ఆచితూచి బౌలింగ్ చేయ‌డంతో ఢిల్లీ జ‌ట్టులో టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట్స్ మెన్ల వెన్ను విర‌వ‌డంలో జ‌స్‌ప్రీత్ బుమ్రా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. ఓపెన‌ర్ పృథ్వీషా, సార‌ధి రిష‌బ్ పంత్‌, రోమెన్ పావెల్ మాత్రమే పెవిలియ‌న్‌లో కుదురుగా నిల‌బ‌డ‌గ‌లిగారు. పృథ్వీ షా 24 ప‌రుగుల‌కు బుమ్రా బౌలింగ్‌లో ఇషాన్ కిషాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. బుమ్రా, ఇషాన్ కిషాన్‌, డానియ‌ల్ శ్యామ్స్ చేతిలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ముగ్గురు బ్యాట్స్‌మెన్లు క్రీజ్‌ను వీడ‌క త‌ప్పలేదు. బుమ్రా బౌలింగ్‌లో రోహిత్‌శ‌ర్మ క్యాచ్ ప‌ట్ట‌డంతో మిచైల్ మార్ష్ గోల్డ్ డ‌కౌట్ అయ్యాడు.

ఇక..రోమ‌న్ పావెల్‌, రిష‌బ్ పంత్ నిల‌క‌డ‌గా ఆడుతూ జ‌ట్టు స్కోర్ పెంచ‌డానికి ప్రయ‌త్నించారు. రోమ‌న్ పావెల్ మాత్రమే 43 ప‌రుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ‌యి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. సార‌ధి రిష‌బ్ పంత్ 19 ప‌రుగుల‌కు ర‌మ‌న్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. త‌ర్వాత అక్సర్ పాటిల్ 19 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. అంత‌కుముందు 10.4 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 59ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు పృథ్వీషా, డేవిడ్ బార్మర్‌ల‌తోపాటు మిచెల్ మార్ష్‌ను పెవిలియ‌న్‌కు సాగ‌నంప‌డంలో జ‌స్‌ప్రీత్ బుమ్రా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. పృథ్వీషా 24 ప‌రుగులు చేసి.. జ‌స్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఇషాన్ కిషాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. డానియ‌ల్ శామ్స్ బౌలింగ్‌లో డేవిడ్ బార్మర్ కొట్టిన బంతిని బుమ్రా క్యాచ్ ప‌ట్ట‌డంతో ఔట‌య్యాడు. ఔట‌య్యే స‌మ‌యానికి డేవిడ్ బార్మర్ కేవ‌లం ఐదు ప‌రుగులే చేశాడు.

మిచైల్ మార్ష్ డ‌కౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ క్యాచ్ ప‌ట్ట‌డంతో మార్ష్ వెనుదిరిగాడు. త‌ర్వాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన ఢిల్లీ సార‌ధి రిష‌బ్ పంత్ ప‌ది ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. స‌ర్ప‌రాజ్ ఖాన్ 10 ప‌రుగులు చేసి, మ‌యాంక్ బౌలింగ్‌లో ఇషాన్ కిషాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. అంత‌కుముందు టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ బౌలింగ్ ఎంచుకున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement