Tuesday, July 16, 2024

Special Story : డ‌బ్బు కోసం… గ‌బ్బు బోధ‌న‌

(అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) : విద్యార్థులకు తరగతుల బోధనతో పాటు నైతిక విలువలు నేర్పి భవిష్యత్‌లో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యాసంస్థలదే. కానీ తెలుగు రాష్ట్రాల్లో నారాయణ విద్యాసంస్థలు ఇందుకు భిన్నంగా అక్రమ మార్గాల్లో సంపాదన పొందే విధానాలపై తర్ఫీదునిస్తున్నాయి. ఆ దిశగా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నాయి. తమ వ్యాపార ప్రయోజనాల కోసం విద్యార్థుల్ని చెడుమార్గాలవైపు నడిపిస్తున్నాయి. చిన్నతనం నుంచే వారి మెదళ్ళలో అనైతికతను చొప్పిస్తున్నాయి. భవిష్యత్‌లో ఇలాం టి విద్యార్థులంతా ఎందుకూ కొరగాకుండా పోతున్నారు.

- Advertisement -

కొందరైతే ఈ అక్రమార్జన లక్ష్యసాధనలో అనూహ్య ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటర్‌ విద్యావిధానం పూర్తిగా ప్రభుత్వ అధీనంలో కొనసాగే సమయంలో ఇంటర్‌ రెండేళ్ళు కేవలం ఇంటర్‌ పాఠ్యపుస్తకాల బోధన మాత్రమే సాగేది. కానీ ఇంటర్‌ విద్యావిధానం నారాయణ విద్యాసంస్థల అధీ నంలోకొచ్చింది. దీనిపై ప్రభుత్వ పెత్తనం నామమాత్రంగా మారిన తర్వాత ఇంటర్‌లో సంబంధిత తరగతుల విద్యాబోధనతో పాటు ఎమ్‌సెట్‌, నీట్‌, నిట్‌, ఐఐటి, జేఈఈ వంటి ఇంజనీరింగ్‌, మెడికల్‌ ప్రవేశార్హత పోటీపరీక్షల కోర్సుల్ని కూడా కలిపి బోధించడం మొదలెట్టాయి. సహజంగానే తమ సంతానానికి ఇంటర్లో నూరు శాతం మార్కుల్తో పాటు ఐఐటిలో సీటు దక్కాలన్న అభిలాష తల్లిదండ్రుల్లో ఉంటుంది. దీన్నే నారాయణ సంస్థలు తమకనుకూలంగా మలచుకుంటున్నాయి. ఇంటర్లో డేస్కాలర్‌కు గరిష్ఠంగా తొలి ఏడాది 30వేలు, రెండో ఏడాది 35 వేలు మాత్రమే వసూలు చేయాలని బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ నిబం ధనలు నిర్దేశిస్తున్నాయి. అయితే అదనంగా కొన్ని కోర్సులు కలిపి ఏడాది లక్షన్నర నుంచి మూడు లక్షలవరకుఈ విద్యాసంస్థలు వసూలు చేస్తున్నాయి. ఇంటర్‌ విద్యార్థి మానసిక, శారీరక పరిస్థితినేమాత్రం పరి గణనలోకి తీసుకోకుండా వారిపై ర్యాంకుల కోసం ఒత్తిడి పెంచుతున్నాయి. రోజుకు 14 గంటల పాటు వార్ని రాచిరంపాన పెట్టిమరీ విద్యాబోధన చేస్తు న్నాయి. ఈక్రమంలో అనవసర పోటీ పరీక్షలక్కూడా వీర్ని సిద్ధం చేస్తున్నాయి. దీనినికి అదనంగా రుసు ములు వసూలు చేస్తున్నాయి. తర్ఫీదునిచ్చేందుకు భారీ మొత్తాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఐఐటి విద్యార్థికి పాలిసెట్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే ఎమ్‌సెట్‌ పట్ల కూడా ఆసక్తి ఉండదు. జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి ఇంజ నీరింగ్‌ విద్యాసంస్థలైన ఐఐటిల్లో సీటు సాధించాలన్నదే వారిముందున్న ఏకైక లక్ష్యంగా ఉంటుంది. అయితే ఈ పరీక్ష రాసేందుకు పోలిసెట్‌, ఎమ్‌సెట్‌ ద్వారా తగిన తర్ఫీదు వస్తుందంటూ విద్యార్థుల్తో పాటు తల్లిదండ్రులకు కూడా ఈ సంస్థలు నచ్చజెబుతున్నాయి.

ఐఐటి, జెఈఈ కోర్సులకు మాత్రమే పరిమితమైన నేరుగా ఈ పరీక్షలకు హాజరైనప్పటికీ పరీక్షా విధానంపై అవగాహన లేక తొట్రుపాటుతో విద్యార్థి చివరి నిమిషంలో ఆశించిన ఫలితం సాధించే అవకాశం ఉండదంటూ భయపెడు తున్నాయి. దీంతో తప్పనిసరి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పోలిసెట్‌, ఎమ్‌సెట్‌ లకు కూడా కోచింగ్‌ ఫీజ్‌తోపాటు పరీక్షా ఫీజు కూడా చెల్లిస్తున్నారు. ఈ రూపంలో బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌ మీడియట్‌ నిబంధనలకు నారాయణ విద్యాసంస్థలు గండికొడుతు న్నాయి. ఈ నిబంధనల్లో ఇంటర్‌ బోధనకు మాత్రమే గరిష్ఠ ఫీజు పరిమితిని విధిం చారు. కానీ అదనంగా పాలిటెక్నిక్‌ ఎం ట్రన్స్‌, ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌లకు ఎలాంటి ఫీజుల్ని బోర్డ్‌ నిర్దేశించ లేదు. వాస ్తవానికది బోర్డ్‌ పరిధిలోని అంశం కూడా కాదు.

ఇంటర్‌ అనంతరం ఐఐటిలో సీటు సాధించాలన్న లక్ష్యం కలిగిన విద్యార్థికి పాలిసెట్‌ లేదా ఎమ్‌సెట్‌ పరీక్షల్ని ఎదుర్కోవడం పెద్దకష్టం కాదు. పైగా దేశంలోనే అత్యంత క్లిష్టతరంగా జరిగే పరీక్షల్లో ఐఐటి, జెఇఇ ఒకటి. దీనికి సంబంధించి తర్ఫీదు పొందుతున్న విద్యార్థికి, చైతన్య, నారాయణ విద్యాసంస్థల ఒత్తిళ్ళతో పోలిసెట్‌, ఎమ్‌సెట్‌లకు హాజరౌతున్నారు. ఇందుకోసం భారీగా ఫీజులుఏ చెల్లిస్తున్నారు. సహజంగానే ఈ స్థాయి ఆలోచన, విజ్ఞానం కలిగిన విద్యా ర్ధులు పోలిసెట్‌, ఎమ్‌సెట్‌లలో మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. ఇదే నారాయణ సంస్థకు వందల, వేల కోట్లు తెచ్చిపెడుతున్నాయి. ఈ ఏడాది పొలిసెట్‌లో తొలి 200 ర్యాంకుల్లో వంద మావేనని నారాయణ పబ్లిసిటీ చేసుకుంటున్నది. ఇలా వారి ఫోటోల్ని పత్రికల్లో ప్రచురించి తమ వద్ద తర్ఫీదైన కారణంగానే ఈ ర్యాంకులు సాధించామంటూ విద్యార్థులతో చెప్పించేందుకు వారికి వేలల్లో ము డుపులు ముట్టజెబుతున్నారు.


గత 20 ఏళ్ళ పాలిసెట్‌, ఎమ్‌సెట్‌ల తొలి 200 ర్యాంకుల్ని పరిశీలిస్తే పాలిసెట్‌లో అత్యున్నత ర్యాంక్‌లు సాధించిన వారెవరూ తెలుగు రాష్ట్రా ల్లోని ఏ పాలిటెక్నిక్‌లోనూ సీటు తీసుకోవడం లేదు. వారెవరూ పాలిటెక్ని కల్‌లో చేరేందుక్కూడా కనీసం ఆసక్తి ప్రదర్సించడం లేదు. అలాగే ఎమ్‌సెట్‌లో అగ్రశ్రేణి ర్యాంకర్లెవరూ తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఇంజనీరింగ్‌ కళాశాలలోనూ చేరడం లేదు. వీరి దృష్టంతా ఐఐటిలపైనే ఉంటుంది. వాస్త వానికి వారి లక్ష్యం, ఆకాంక్ష ఐఐటిల్లో సీటు సాధనే. ఆ స్థాయిలోనే చిన్న నాటి నుంచి వారు తర్ఫీదు పొందుతున్నారు. అత్యధికులు సిీబీఎస్‌ఇ విధా నంలో ప్లస్‌ 2 పూర్తి చేస్తున్నారు. ఈ స్థాయి ఆలోచనాపరిధి, ఐక్యూ ఉన్న విద్యార్థుల్ని ఎంచుకుని మరీ నారాయణ సంస్థలు అక్రమార్కులుగా మార్చేస్తున్నాయి. వీరికి చిన్నతనంలోనే అక్రమార్జనపై ఆస క్తి పెంపొ దిస్తున్నాయి. తమ ఫోటోలు, ఇంటర్వ్యూలకు వెలకట్టి చెల్లిస్తున్నాయి. అప్పట్నుంచే వీరి ఆలోచనా దృక్పథంలో తీవ్ర మార్పొచ్చేస్తోంది.

ప్రదర్శిస్తున్నాయి. ఈక్రమంలో విద్యార్థులు నలిగిపోతు న్నారు. కొందరు ఇంత మానసిక ఒత్తిడి తట్టుకోలేక, మరికొందరు కుటుంబ సభ్యుల ఆర్ధిక పరిస్థితి సహకరించక ఎటూ తేల్చుకోలేని స్థితిలో అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో వందల సంఖ్యలో విద్యార్ధులు ఆత్మహత్యలకు గుర య్యారు. కొందరు హాస్టళ్ళ గదుల్లోనే ఉరేసుకున్నారు. కొందరు భవనాలపై నుంచి దూకేశారు. ఇంకొందరు విషాహారం తిని ప్రాణా లొదిలారు. అయితే ఏ సందర్భంలోనూ ఈ యాజమాన్యాల్ని ప్రశ్నించే సాహసం పోలీసులు, విద్యావ్యవస్థలు చేయలేదు. కనీసం విద్యార్ధి సంఘాలు కూడా నోరుమెదపలేదు. ఇందుక్కారణం ఈ సంస్థలకు ప్రభుత్వాల ప్రత్యక్ష, పరోక్ష మద్దతుండడమే. ప్రధాన పార్టీలకు ఈ సంస్థల యజమానులు మహరాజ పోషకులుగా వ్యవహరించడమే.

విద్యార్థులపై ఒత్తిళ్లు…
ఈ ర్యాంకుల కోసం విద్యార్థులపై నారాయణ సంస్థలు భారీగా ఒత్తిళ్ళు పెడుతున్నాయి. వారి ఆరోగ్యం, కుటుంబ సమస్యల్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అలాగే వారి కుటుంబ సభ్యులు ఫీజుల చెల్లింపులో ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా పట్టించుకోవడంలేదు. తమకందుబాటులోకొచ్చిన తెలివైన విద్యార్థినుంచి బలవంతంగా నైనా ఫీజులు వసూలు చేసి రోజస్తమానంచదివించి ర్యాంకులు సాధిం చడం ద్వారా పోటీ పరీక్షల ఫలితాల్లో రారాజులు తామేనని నిరూపిం చుకునే ఆత్రం ప్రదర్శిస్తున్నాయి. ఈక్రమంలో విద్యార్థులు నలిగిపోతు న్నారు. కొందరు ఇంత మానసిక ఒత్తిడి తట్టుకోలేక, మరికొందరు కుటుంబ సభ్యుల ఆర్ధిక పరిస్థితి సహకరించక ఎటూ తేల్చుకోలేని స్థితిలో అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో వందల సంఖ్యలో విద్యార్ధులు ఆత్మహత్యలకు గుర య్యారు. కొందరు హాస్టళ్ళ గదుల్లోనే ఉరేసుకున్నారు. కొందరు భవనాలపై నుంచి దూకేశారు. ఇంకొందరు విషాహారం తిని ప్రాణా లొదిలారు. అయితే ఏ సందర్భంలోనూ ఈ యాజమాన్యాల్ని ప్రశ్నించే సాహసం పోలీసులు, విద్యావ్యవస్థలు చేయలేదు. కనీసం విద్యార్ధి సంఘాలు కూడా నోరుమెదపలేదు. ఇందుక్కారణం ఈ సంస్థలకు ప్రభుత్వాల ప్రత్యక్ష, పరోక్ష మద్దతుండడమే. ప్రధాన పార్టీలకు ఈ సంస్థల యజమానులు మహరాజ పోషకులుగా వ్యవహరించడమే.

అక్రమాలపై విచారణ జరగాలి….
ప్రభుత్వం ఎంతో శ్రమకోర్చి పాలిసెట్‌, ఎమ్‌సెట్‌లను నిర్వహిస్తోంది. ప్రతి ఏటా ఇందులో అగ్రస్థానంలో నిలుస్తున్న విద్యార్థులు సంబంధిత కోర్సుల్లో ఎందుకు చేరడంలేదన్న విచారణ నిర్వహించాలి. వీరిపై ఎవరు బలవంతంగా ఒత్తిడి తెచ్చి ఈ పరీక్షల్ని అనవసరంగా రాయిస్తు న్నారన్నది నిగ్గు తేల్చాలి. సంబంధిత కోర్సుల్లో చేరే ఆసక్తి లేని చైతన్య, నారాయణ విద్యాసంస్థలు ఆర్ధికంగా ప్రలోభాలకు గురిచేసి తమ వ్యాపార సామ్రాజ్యాల విస్తరణకు వినియోగించుకుంటుందోనన్న దానిపై కూడా విచారణ జరగాలి. అలాగే నారాయణ విద్యాసంస్థల్లో జరిగిన ఆత్మహత్యలను ఈ సంస్థ యాజమాన్యం చేసిన హత్యలుగానే పరిగణించి కేసులు నమోదు చేసి సంపూర్ణ స్థాయిలో విచారణ నిర్వహించాలి. అప్పుడే తెలుగురాష్ట్రాల్లో ఇంటర్‌తోపాటు పోటీ పరక్షలకు పట్టిన నారాయణ అనే చీడపురుగు ఏరివేత సాధ్యమౌతుంది. విద్యార్థ దశ నుంచి మస్తిష్కాల్ని విషపూరితం చేస్తున్న వ్యవస్థల నిర్మూలనకు మార్గం సుగమమౌతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement