Saturday, December 7, 2024

మిష‌న్ మోడ్ – వ‌చ్చే ఏడాదిన్న‌ర‌కాలంలో 10ల‌క్ష‌ల ఉద్యోగాలు-ప్ర‌ధాని మోడీ

వ‌చ్చే ఏడాదిన్న‌ర కాలంలో కేంద్ర ప్ర‌భుత్వంలోని వివిధ‌శాఖ‌ల ప‌రిధిలో 10ల‌క్ష‌ల మంది ఉద్యోగుల నియామ‌కానికి ఆదేశాలు జారీ చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీల అంశాన్ని వివిధ పార్టీలు తరచూ ప్రస్తావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖలు, విభాగాల పరిధిలో మానవ వనరుల పరిస్థితులపై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. 2024 ఎన్నికల ముందు నిరుద్యోగుల మనసు చూరగొనే ప్రయత్నం చేశారు. అన్ని శాఖల పరిధిలో ఉద్యోగ ఖాళీలపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మిషన్ మోడ్ లో వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మంది నియామకాలు చేపట్టాలని ఆదేశించార‌ని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతిపక్షాలు తరచూ నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తరుణంలో ప్రధాని నుంచి ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement