Thursday, May 2, 2024

దూసుకుపోతోన్న విక్ర‌మ్-11రోజుల‌కి రూ.300కోట్లు

బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కింది విక్ర‌మ్ చిత్రం. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ రూపొందించాడు. కాగా ఈ మూవీలో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించారు. ఈ చిత్రం మొద‌టి రోజు నుంచే భారీ వ‌సూళ్ళ‌ను రాబడుతుంది. తాజాగా ఈ చిత్రం రూ.300 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టింది. కేవ‌లం 11 రోజుల్లోనే ‘విక్ర‌మ్‌’ ఈ ఘ‌న‌త సాధించింది అంటే విశేషం అనే చెప్పాలి. తెలుగులో విక్ర‌మ్ చిత్రాన్ని హీరో నితిన్ విడుద‌ల చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ.7.48 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. కాగా 11 రోజులు పూర్త‌య్యే స‌రికి విక్ర‌మ్ సినిమా రూ.14.40 కోట్ల షేర్‌ను సాధించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించిన‌ ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్‌, తమిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సూర్య గెస్ట్ రోల్‌లో న‌టించాడు. రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై ఆర్. మహేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement