Wednesday, June 12, 2024

జేపీ నడ్డాపై ట్విట్టర్ లో మంత్రి హరీష్ రావు ఫైర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు బీజేపీ నేత జేపీ నడ్డాపై ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. 2016లో నడ్డా ఇచ్చిన హామీలపై ఆయన నిలదీశారు. మీ హామీలు ఏమయ్యాయి అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.మర్రిగూడలో ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చౌటుప్పల్ లో 8.2 ఎకరాలు కూడా ఇచ్చింది., నాటి కేంద్ర మంత్రిగా నడ్డా హామీ ఇచ్చి ఆరేళ్లు గడిచింది, ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కు కేంద్రం నయా పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు.

మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.. కానీ నెరవేర్చలేదన్నారు. అబద్ధపు హామీలు ఇస్తూ ప్రజాగోడు పట్టని బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగటానికి మునుగోడు వస్తున్నారు అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement