Thursday, April 18, 2024

జపాన్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ విశేషాలు..ఫొటోలు పోస్ట్

జపాన్ లో సందడి చేస్తోంది ఆర్ ఆర్ ఆర్ టీం. ఈ మేరకు వారు మీడియాతో చిట్ చాట్ చేశారు. కాగా ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ అక్టోబర్‌ 21న శుక్రవారం జపాన్ లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి అండ్‌ హీరోల టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌లో అలియాభట్‌, అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియాశరణ్‌, ఒలివియా మొర్రీస్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ కలిసి జపాన్‌ స్థానిక మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విశేషాలని మీడియాతో పంచుకున్నారు. జక్కన్న టీం ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఇప్పటికే తారక్ ‌, రాంచరణ్‌ జపాన్‌ సందర్శనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement