Friday, April 26, 2024

నిత్య యవ్వ‌నంగా క‌నిపించేందుకు ప్ర‌యోగం : స‌క్సెస్ అయ్యేనా


నిత్య‌య‌వ్వ‌నంగా క‌నిపించాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి. కానీ అది సాధ్య‌మా.. వ‌య‌సు పెరిగే కొల‌దీ వృద్ధాప్య‌పు ఛాయ‌లు వ‌స్తుండ‌టం స‌హ‌జ‌మూ. కానీ య‌వ్వ‌నంగా ఉండేందుకు ప్ర‌యోగాలు చేస్తున్నారు శాస్త్ర‌వేత్త‌లు. ఏజింగ్‌ ప్రక్రియను నిలిపేసే సాంకేతికతను అభివృద్ధి చేయాలని ఇప్పటికే శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ లివర్‌పూల్‌ శాస్త్రవేత్తలు కీలక ప్రయోగానికి సిద్ధమయ్యారు. మనిషి కండర కణాలను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) పంపించనున్నారు.

స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ఈ కణాలను రోదసిలోకి తీసుకుపోనున్నది. గురుత్వాకర్షణ, వాతావరణం లేనటువంటి అక్కడి ల్యాబ్‌లో ఉంచనున్న ఈ కణాలపై విద్యుత్తు ప్రసారంతో ఉద్దీపన చర్యలు జరుపనున్నారు. నెల రోజుల అనంతరం ఆ కణాలను భూమి మీదకు తీసుకొచ్చి ‘మైక్రో ఏజింగ్‌’ పేరిట అధ్యయనం చేస్తారు. ఈ ప్ర‌యోగం స‌క్సెస్ అయితే ఇక నిత్య‌య‌వ్వ‌నంగా క‌నిపించ‌డం ఖాయ‌మంటున్నారు శాస్త్ర వేత్త‌లు. ఏమ‌వుతుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వం

#AndhraPrabha #AndhraPrabhaDigitalడి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement