Monday, April 29, 2024

Breaking: మెట్రో లిఫ్ట్‌లో ఘోరం.. యువ‌తి ముందే బ‌ట్ట‌లిప్పేసి ఏం చేశాడంటే..

ఓ యువ‌కుడు కామంతో చెల‌రేగిపోయాడు. అమీర్‌పేట్ మెట్రో స్టేష‌న్ లిఫ్ట్‌లోనే యువ‌తి ముందే అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. లిఫ్ట్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. ఓ యువ‌కుడు స్టేష‌న్ ద‌గ్గ‌ర ఉన్నాడు. అటువైపు నుంచి ఒంట‌రిగా వెళ్తున్న యువ‌తిని అనుస‌రించాడు. ఆమె మెట్రో లిఫ్ట్ ఎక్క‌గానే అత‌ను కూడా లిఫ్ట్‌ ఎక్కాడు. క్ష‌ణాల్లోనే ఆమె ముందు త‌న బ‌ట్ట‌లు మొత్తం విప్పేసి అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లెట్టాడు. దీంతో షాకైన బాధితురాలు ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీసుల‌కు స‌మాచారం అందించింది.

నిమిషాల వ్య‌వ‌ధిలోనే అక్క‌డికి చేరుకున్న పోలీసులు ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. అత‌డిని ఒడిశాకు చెందిన రాజు (19)గా గుర్తించారు. అయితే త‌న ఫోన్‌లో అస‌భ్య‌క‌ర‌మైన వీడియోలు చూస్తూ ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు రాజు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించాడు. ఉపాధి నిమిత్తం హైద‌రాబాద్ వ‌చ్చిన అత‌ను ఎలాంటి ప‌ని దొర‌క్క‌పోవ‌డంతో ఇట్లాంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement