Sunday, April 28, 2024

మీటర్ రివ్యూ.. హిట్టా.. ఫట్టా

కిర‌ణ్ అబ్బ‌వ‌రం టాలీవుడ్ లో ఈ యంగ్ హీరో పేరు మారు మ్రోగుతోంది. సినిమా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం మీట‌ర్. ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం హిట్టా ఫ‌ట్టా ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ ఏంటంటే.. అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) ఒక కానిస్టేబుల్ కొడుకు. తండ్రి తన కొడుకు మంచి పోలీసాఫీసర్ కావాలని కోరుకుంటే.. పోలీస్ గా తండ్రి పడ్డ కష్టాలు చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాకీ తొడగకూడదని గట్టిగా నిర్ణయించుకుంటాడు. కానీ అతను అనుకోకుండా ఎస్ఐ అవుతాడు. తన ప్రమేయం లేకుండా మంచి పేరు కూడా వస్తుంది. కానీ ఎలాగైనా ఆ ఉద్యోగం పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తున్న అర్జున్ హోం మినిస్టర్ బైరెడ్డి సాయంతో ఆ ప్రయత్నంలో విజయవంతం అవుతాడు. కానీ హోం మినిస్టర్ కు ఫేవర్ చేసే క్రమంలో తన తండ్రినే కాల్చడం.. అతను కోమాలోకి వెళ్లడం.. ఒక వ్యక్తి చావుకు కారణమవడంతో అర్జున్ లో మార్పు వస్తుంది. మళ్లీ పోలీస్ అయి సిన్సియర్ గా డ్యూటీ చేయడం మొదలుపెట్టి.. హోం మినిస్టర్ ని ఢీకొడతాడు. మరి ఈ పోరాటంలో ఎవరు గెలిచారు అన్నది మిగతా కథ.

విశ్లేషణ.. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థలో కిరణ్అబ్బ‌వ‌రం లాంటి కొంచెం పేరున్న హీరో చేసిన సినిమా కావడంతో ఇందులో ఏదో ఒక విశేషం ఉండే ఉంటుందని.. ముందే ఒక అంచనాకు రావడం కరెక్ట్ కాదనుకుని థియేటర్లలోకి వెళ్లి కూర్చుంటే.. దిమ్మ దిగిరి బొమ్మ కనిపించడానికి ఎంతో సమయం పట్టదు. వందల కోట్లు పెట్టి ‘పుష్ప’ లాంటి క్రేజీ సినిమాలు తీస్తున్న మైత్రీ సంస్థ నుంచి ‘మీటర్’ అనే చిత్రం ఎలా అన్ని దశలనూ దాటి థియేటర్ వరకు వచ్చిందో ఎంత ఆలోచించినా అంతుబట్టదు. కొన్ని దశాబ్దాల ముందు చూసినా కూడా ఔట్ డేటెడ్ అనిపించే సినిమా ఇది. ఒక మామూలు పోలీస్.. పెద్ద పొలిటీషియన్ ని ఢీకొట్టి అతణ్ని ఆటాడించే కమర్షియల్ ఫార్మాట్లో ఈ రోజుల్లో సినిమా తీసి మెప్పించగలం అని నమ్మిన మీటర్ టీంను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. సినిమా మొత్తంలో బాగుంది.. కొత్తగా ఉంది అని చెప్పడానికి ఒక్క సన్నివేశం కూడా లేని సినిమా ‘మీటర్’.

- Advertisement -

నటీనటుల న‌ట‌న.. కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలతో వచ్చిన పేరును కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఎంత వేగంగా పోగొట్టుకుంటున్నాడో చెప్పుకోవాలి. అతడి జడ్జిమెంట్ ఎంత దారుణంగా ఉంటోందో ‘సెబాస్టియన్’.. ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’.. ఇప్పుడొచ్చిన ‘మీటర్’ ఉదాహరణలుగా నిలుస్తాయి. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు అతడి మీద పూర్తిగా నమ్మకం కోల్పోతే అందుకు పూర్తిగా అతనే బాధ్యత వహించాలి. మొదట్లో సీమ యాసలో డైలాగులు చెబుతూ డిఫరెంట్ యాటిట్యూట్ చూపిస్తే.. కుర్రాడు ఏదో భిన్నంగా చేస్తున్నాడు అనిపించింది కానీ.. అతను ఒకే రకం నటనతో.. హావభావాలతో విసిగించేస్తున్నాడు. ‘మీటర్’లో కిరణ్ ‘నటించాడు’ అని చెప్పడానికి ఒక్క సన్నివేశం కూడా లేదు. ఈ విషయంలో హీరోయిన్ అతుల్య అతడికి సరైన జోడీ అనిపిస్తుంది. విలన్ పాత్రధారి నటన గురించి చెప్పడానికి ఏమీ లేదు. వినయ్ వర్మ లాంటి టాలెంటెడ్ నటుడిని ఇందులో పూర్తిగా వృథా చేశారు. హీరో సహాయకుడి పాత్రలో సప్తగరి నుంచి కూడా ఏ మెరుపులు లేవు. పోసాని.. మిగతా నటీనటులంతా కూడా సాధారణ పాత్రల్లో కనిపించారు.

టెక్నీషియ‌న్స్.. మీటర్’లో సాంకేతిక విలువలంటూ చెప్పుకోడానికి ఏమీ లేవు. సాయికార్తీక్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడని పాటలు వింటే అర్థమవుతుంది. చాలా మొక్కుబడిగా పాటలు.. నేపథ్య సంగీతం ఇచ్చాడు. వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణంలోనూ మెరుపులు లేవు. పోస్టర్ మీద మైత్రీ మూవీ మేకర్స్ లోగో ఉందే తప్ప.. ఆ సంస్థ స్థాయికి ఏమాత్రం తగని విధంగా ఉన్నాయి నిర్మాణ విలువలు. ముఖ్య పాత్రలకు ఎంచుకున్న నటీనటుల దగ్గర్నుంచి.. లొకేషన్ల వరకు అన్ని విషయాల్లోనూ రాజీ పడ్డ విషయం తెరపై కనిపిస్తుంది. సూర్య రచన కానీ.. రమేష్ కడూరి దర్శకత్వం కానీ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ప్రతి సీన్లోనూ ‘ఔట్ డేట్’ ఫీల్ ఉండేలా వాళ్ల పనితనం సాగింది.మొత్తానికి మీట‌ర్ ప‌గిలిపోయింద‌నిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement