Saturday, December 7, 2024

హాస్ప‌టల్స్ లో మందులు..ఆక్సిజ‌న్.. సిద్ధం చేసుకోండి.. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి

గ‌త కొన్ని నెల‌లుగా దేశంలో కొవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉంది..కానీ ప‌లు రాష్ట్రాల్లో మ‌ళ్లీ కేసులు పెరుగుతుండ‌డంతో ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త కేసులు, కొవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ ప్రవర్తనకు కట్టుబడి ఉండడమనే ఐదు పాయింట్ల వ్యూహానికి కట్టుబడి అప్రమత్తంగా ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు.దీనికి తోడు ఇన్‌ఫ్లుయెంజా ఉపరకం హెచ్3ఎన్2 కేసులు కూడా పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. సమస్య మరింత జటిలం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని, తక్షణమే పరిష్కరించాలని పేర్కొంది. ఇన్‌ఫ్లుయెంజా తరహా అనారోగ్యం, లేదంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ కేసులుగా కనిపించే శ్వాసకోస సంబంధిత వ్యాధికారకాలపై సమగ్ర నిఘా కోసం కార్యాచరణ మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఆసుపత్రుల్లో మందులు, మెడికల్ ఆక్సిజన్, టీకాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement