Thursday, April 25, 2024

Big Breaking | తెలంగాణ‌లో భారీగా ఐపీఎస్ అధికారుల బ‌దిలీ.. 60 మందిని ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తూ నిర్ణ‌యం

తెలంగాణ‌లో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారుల బ‌దిలీ అయ్యింది. 60 మంది ఆఫీస‌ర్ల‌ను ఒకేసారి ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో చాలామంది పోలీస్ క‌మిష‌న‌ర్ స్థాయి అధికారులున్నారు. ఉన్న‌తాధికారుల‌తో సీఎం కేసీఆర్ దీనిపై క‌స‌ర‌త్తు చేసిన త‌ర్వాత ఈ నిర్ణ‌యం జ‌రిగింది. కాగా, న‌ల్గగొండ‌, వ‌న‌ప‌ర్తి, సిరిసిల్ల‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎస్పీల‌కు స్థాన చ‌ల‌నం క‌లిగింది. అంతేకాకుండా క‌రీంన‌గ‌ర్‌, రామ‌గుండం పోలీసు క‌మిష‌న‌ర్‌లు కూడా ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు.

అనధికార సమాచారం మేరకు బదిలీల్లో కరీంనగర్, రామగుండం సీపీలతోపాటు నల్గొండ, సిరిసిల్ల, వనపర్తి, మహబూబ్‌నగర్ ఎస్పీలు ఉన్నారు. ఇక రామగుండం సీపీగా సుబ్బారాయుడు బదిలీ అయ్యారు. మల్కాజిగిరి డీసీపీగా జానకి దరావత్, ఖమ్మం సీపీగా సురేశ్, జగిత్యాల ఎస్పీగా భాస్కర్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజీవ్ రతన్ బదిలీ అయినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement