Sunday, May 19, 2024

క‌ర్ర‌సాము చేసిన మంత్రి ‘మ‌నోతంగ‌రాజ్’ – ఆశ్య‌ర్య‌పోయిన స్థానికులు

త‌మిళ‌నాడు ఐటీశాఖ మంత్రి మ‌నోతంగ‌రాజ్ ..నాగ‌ర్ కోయిల్ లో జ‌రుగుతోన్న ప్రాచీన యుద్ధ కళా విద్యల పోటీలకి హాజ‌ర‌య్యారు. లెమురియా వర్మకళారి ఆదిమురై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. కాగా సంప్రదాయ పంచెకట్టుతో విచ్చేసిన ఆయన బరిలో దిగి కర్రసాముతో అలరించారు. మంత్రి ఎంతో వేగంగా కర్రసాము చేయడం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. సింగిల్ హ్యాండ్, డబుల్ హ్యాండ్ విన్యాసాలతో మంత్రి మనో తంగరాజ్ ఎంతో ఉత్సాహంగా కదిలారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. లెమురియా ఫౌండేషన్ లో ఆదిమురై, సిలంబం, వర్మమ్, ఆదిమురై యోగా, కలరి, పరై ఇసై వంటి ప్రాచీన విద్యల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన వారి మధ్య పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. ఇప్పుడు మంత్రి చేసిన క‌ర్ర‌సాము వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement