Monday, April 29, 2024

సెక్స్‌కు బానిస‌గా మారిన‌ ఉన్మాది.. 11 ఏండ్ల బాలిక‌ను రేప్ చేసి చంపేశాడు..

అహ్మ‌దాబాద్‌లోని ప‌ల్సానాలో 11 ఏండ్ల బాలిక హ‌త్యాచార కేసులో నిందితుడిని సూర‌త్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ఇంట్లో బాధితురాలితో పాటు ఆమె సోద‌రుడు ఒంట‌రిగా ఉన్నారు. బాలిక త‌ల్లితండ్రులు ప‌నికి వెళ్లి తిరిగి రాగానే పొరుగునుండే ద‌యారాం ప‌టేల్ బాధితురాలిని తీసుకువెళ్లాడ‌ని, ఇంత‌వ‌ర‌కూ త‌ను తిరిగిరాలేద‌ని వారి కుమారుడు తెలిపాడు. బాలిక కోసం త‌ల్లితండ్రులు గాలించ‌గా వారి ఇంటి స‌మ‌పంలో బాలిక డెడ్‌బాడీ క‌నిపించింది. బాధితురాలిని స‌మీప ఆస్ప‌త్రికి తీసుకువెళ్ల‌గా అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు డాక్ట‌ర్లు నిర్ధారించారు.

ఈ ఘ‌ట‌న‌పై కుటుంబ‌స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్ద‌రు అనుమానితులు ద‌యారాం, క‌లూరాంల‌ను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో బాలిక‌తో క‌నిపించిన ద‌యారాం ఆమెను ఓ రూంలోకి తీసుకువెళ్లి తాళం వేయ‌డం క‌నిపించింది. ద‌యారాం త‌న స్నేహితుడు క‌లూరాం సాయంతో ఈ నేరం చేశాడ‌ని సూర‌త్ పోలీసులు వెల్ల‌డించారు. ద‌యారాం సెక్స్ ఉన్మాదిలా మారాడని అత‌డి భార్య పోలీసుల‌కు తెలిపింది. ద‌యారాం మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు ఉన్నాయ‌ని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన సూర‌త్ పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement