Friday, May 3, 2024

యువతి ప్రైవేట్ పార్ట్స్ నుంచి స్వాబ్ శాంపిల్స్.. ల్యాబ్ టెక్నీషియన్‌కు పదేళ్ల జైలు..

కరోనా టెస్టుల పేరిట ఓ యువతి పట్ల ల్యాబ్ టెక్నీషియన్ అసభ్యంగా ప్రవర్తించాడు. ముక్కు లేదా గొంతు నుంచి తీసుకోవాల్సిన స్వాబ్ శాంపిల్‌ను ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి తీసుకున్నాడు. అసలు అలాంటి టెస్టే ఉండదని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కోర్టులో విచారణ జరిగింది.. తాజాగా నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా బద్నెరా టౌన్‌కి చెందిన ఓ యువతి స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది. మాల్‌లో పనిచేసే మ‌రో వ్య‌క్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. అక్క‌డ ప‌నిచేసే మిగతా సిబ్బంది అంతా పరీక్షలు చేయించుకోవాలని మాల్ యాజమాన్యం కోరింది. దీంతో గ‌త ఏడాది జులై 28న‌ మాల్‌లో పనిచేసే 20 మంది సిబ్బందితో కలిసి ఆ యువతి స్థానిక మోదీట్రామా కేర్ హాస్పిటల్‌కి వెళ్లింది. అక్కడ అల్కేష్ దేశ్‌ముఖ్ అనే ల్యాబ్ టెక్నీషియన్ మాల్ సిబ్బంది నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరించాడు.

ఈ క్రమంలో ఆ యువతి ముక్కు నుంచి స్వాబ్ శాంపిల్ సేకరించిన అల్కేష్.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధార‌ణ‌ అయినట్లు చెప్పాడు. ఆపై ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా శాంపిల్స్ సేకరించాలని చెప్పాడు. అది నిజమేనని నమ్మి ఆమె అతనికి సహకరించింది. కరోనా టెస్ట్ కిట్ ద్వారా అల్కేష్ ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి స్వాబ్ శాంపిల్ సేకరించాడు. ఆ త‌ర్వాత ఆ యువ‌తి అట్లాంటి టెస్టులేవీ ఉండ‌వ‌ని తెలుసుకుని పోలీసుల‌ను ఆశ్ర‌యించి కేసు పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement