Tuesday, January 25, 2022

Breaking: నల్గొండలో దారుణం.. మహంకాళి కాళ్ల దగ్గర మొండెం లేని తల

నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతపల్లి మండలం విరాటనగర్ మెట్టు మహంకాళి ఆలయంలో మొండెంలేని తలను స్థానికులు గుర్తించారు. హైదరాబాద్-నాగార్జున సాగర్ రహదారిపై ఉన్న మెట్టు మహంకాళి దేవాలయంలో అమ్మవారి విగ్రహం కాళ్ల దగ్గర ఒక వ్యక్తి తలను నరికి పడేశారు. వ్యక్తిని చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆ వ్యక్తి తలను వదిలి పెట్టి వెళ్లారు. దీంతో స్థానిక గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News