Saturday, May 18, 2024

ప‌బ్లిక్ ప్లేస్ లో స్నానం చేసిన న‌టి – సిగ్గులేదా అంటూ నెటిజ‌న్ విమ‌ర్శ‌- సిగ్గు అంటే ఏంటి అంటోన్న బ్యూటీ

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఏ మూల ఏం జ‌రిగినా ఇట్టే తెలిసిపోతోంది. అంతే కాదు ఆ వార్త హైలెట్ కూడా అవుతోంది. కాగా ఓ న‌టి ప‌బ్లిక్ ప్లేస్ లో స్నానం చేయ‌డంతో విమ‌ర్శ‌ల పాల‌యింది. ఆమె మ‌ల‌యాళీ హీరోయిన్ అయ్య‌ప్ప‌న్. మలయాళంలో మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫెర్ లో నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. ఈ యంగ్ బ్యూటీ బికినీలో పచ్చని ప్రకృతి నడుమ షవర్ కింద స్నానం చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. అందులోనే ఆమె దీపికా పదుకొనె ‘గెహ్రాయాన్’ చిత్రంలోని ఓ సాంగ్ కి డాన్స్ చేస్తూ కనిపించింది. దీనితో నెటిజన్లు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నేచర్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది అని కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఓ ఆకతాయి నెటిజన్ మాత్రం ఆమెపై మండిపడుతూ వివాదాస్పదంగా కామెంట్ చేశాడు. ‘ఛీ సిగ్గులేదా.. స్నానం చేస్తున్న వీడియోల్ని పోస్ట్ చేస్తావా.. ఈవ్ టీజింగ్ కేసులు ఇక ఎలా తగ్గుతాయి’ అంటూ ఘాటుగా విమర్శించాడు. దీనితో సానియా సింపుల్ గా అతడికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ‘అసలు సిగ్గు అంటే ఏంటి’ అని అతడినే ప్రశ్నించింది. దీనితో కొంతమంది నెటిజన్లు సానియాకు మద్దతు తెలుపుతున్నారు. మరికొంతమంది విమర్శలు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement