Friday, November 1, 2024

Malala Yousafzai: పెళ్లి చేసుకున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసుఫ్‌ జాయ్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లోని బర్మింగ్‌ హామ్‌లో నివసిస్తున్న మలాలా.. కుటుంబ సభ్యుల సమక్షంలో అస్సర్‌ను పెళ్లి చేసుకున్నారు. తన భర్తతో కలిసి పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అన్సర్, తాను జీవిత భాగస్వాములమయ్యామని, తమ నిఖా నిరాడంబరంగా జరిగిందని మలాల సోషల్ మీడియాలో పేర్కొంది. భార్యాభర్తలుగా కొత్త ప్రయాణం సాగించడానికి సంతోషంగా ఉన్న తమకు ఆశీస్సులు పంపాలని కోరింది.

పాకిస్థాన్‌లో బాలికా విద్య కోసం పాడుపడుతూ ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తిన మలాలాను హత్య చేసుందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. 2012లో ఆమె ఉన్న పాఠశాల బస్సులోకి చొరబడిన తాలిబన్లు కాల్పులు జరిపారు. అయితే, తీవ్ర గాయంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం బ్రిటన్‌లో చికిత్స అనంతరం ఆమె అక్కడే స్థిరపడ్డారు. ఉగ్ర ఘటన తర్వాత కూడా బాలికా విద్య కోసం పోరాడుతూనే ఉన్న ఆమెకు 2014లో 17 ఏళ్ల వయసులో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఫలితంగా ఆ బహుమతి అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా మలాలా రికార్డు నెలకొల్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement