Friday, May 17, 2024

Breaking: మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ అరెస్ట్

మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ ను అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌ను Enforcement Directorate అధికారులు ప్రశ్నించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసు సంబంధించి ఈడీ అధికారులు నవాబ్ మాలిక్‌ను విచారించారు. ఈరోజు 7 గంటలకు నవాబ్‌ మాలిక్‌ను ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లిన అధికారులు.. విచారణ చేశారు. అనంత‌రం దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఈడీ కార్యాలయానికి నవాబ్ మాలిక్ ఉదయం 8 గంటలకు వచ్చారని.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంతో ఎన్సీపీ కార్య‌క‌ర్త‌లు ఈడీ కార్యాల‌యం ఎదుట ఆందోళ‌న‌కు దిగారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement