Friday, February 23, 2024

Mahabubnagar – 14 నియోజకవర్గాలలో పోలింగ్ కు సర్వం సిద్ధం

మహబూబ్ నగర్,నవంబర్ 29 (ప్రభ న్యూస్):ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాధారణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది.ఈ నేపథ్యంలోఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాలకు 201 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ భారీ బందోబస్తుతో పకడ్బందీ చర్యలు చేపట్టారు.

గురువారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది.ఈ సందర్భంగా ఇప్పటికే అధికారులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి కేంద్ర బలగాలు, పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహించారు.ఉమ్మడి జిల్లాలో పోలింగ్ కు సంబంధించి ఈవిఎం మెషిన్లు ఇతర సామాగ్రినీ సిద్ధం చేసి ఎన్నికల అధికారులు అన్నిటినీ పర్యవేక్షించి బూత్ స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు తరలించారు.

ముఖ్యంగా ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రత్యేక ఎన్నికల అధికారులు,జిల్లా ఉన్నతాధికారులు పటిష్ట బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు.పోలింగ్ కేంద్రాల వద్ద వంద మీటర్ల వరకు ప్రజలు ఎవరు కూడా ఉండరాదని ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు, ఓటర్లను ప్రోలోబపెట్టే కార్యక్రమాలు చేపట్టారని అధికారులు ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు.

.కాగాఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలకు 32 లక్షల 79 వేల 332 మంది ఓటర్లు ఉండగా3916 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఓటర్లు మద్యం డబ్బు ఇతర పరలోభాలకు దొంగ కుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎవరైనా ప్రలోభాలకు గురి చేసిన మద్యం డబ్బు పంచినట్లు తెలిసిన ప్రజలు 1950 సివిజన్ యాప్ ఎన్నికల పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు.

ఫిర్యాదులు యుద్ధ ప్రాతిపదికన నిమిషాల వ్యవధిలో పరిష్కరించేందుకు సరిపడా ఇన్ఫోసిస్మెంట్ సిబ్బంది పోలీస్ పలకాల సిద్ధంగా ఉన్నాయని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement