Monday, May 20, 2024

లుథియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు కేసులో పురోగ‌తి

పంజాబ్ లో లుథియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు కేసులో పురోగ‌తి ల‌భించింది. ఘ‌ట‌నాస్థ‌లం నుంచి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మృత‌దేహాంపై ఉన్న ప‌చ్చ‌బొట్టు, అక్క‌డ దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా అత‌డిని మాజీ హెడ్ కానిస్టేబుల్ గా గుర్తించారు పోలీసులు. ఈ కానిస్టేబుల్ గ‌తంలో డ్ర‌గ్స్ ని త‌ర‌లిస్తు ప‌ట్టుబ‌డ్డాడు. దాంతో 2019లో అత‌డిని విధుల నుండి తొల‌గించిన‌ట్టు సీనియ‌ర్ పోలీసు అధికారి చెప్పారు. అతడి పేరు గగన్‌దీప్ సింగ్ (30) అని, ఖన్నాలోని లాల్‌హెరీ రోడ్డులో నివసించేవాడట‌. ఆగస్టు 2019లో అరెస్ట్ అయ్యాడని, రెండేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించినట్టు వెల్ల‌డించారు. ఈ ఏడాది సెప్టెంబరులో బెయిలుపై జైలు నుంచి విడుదల‌య్యాడు. శుక్రవారం ఈ కేసు విచారణకు రావాల్సి ఉండగా ముందురోజే అతడు కోర్టుకు ఎందుకు వచ్చాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement