Tuesday, April 30, 2024

Big Breaking | కేసీఆర్​ను గద్దె దించుదాం రండి.. ఇక్కడ అధికారం బీజేపీదే: అమిత్​షా

కేసీఆర్​ను గద్దె దించి బీజేపీకి అధికారం ఇచ్చేందుకు పిడికిలి బిగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్​షా పిలుపునిచ్చారు. ఇవ్వాల (మంగళవారం) ఆదిలాబాద్​లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్​, కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలపై అమిత్​షా విరుచుకుపడ్డారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

‘‘కుమ్రం భీమ్​ పేరు వినగానే రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి.. డిసెంబర్​ 3న తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పడుతుంది. బీజేపీ సర్కారు వస్తే ప్రతి జిల్లాలో విమోచన దినోత్సవం నిర్వహిస్తాం. తెలంగాణకు డబులింజన్​ సర్కారు ఎంతో అవసరం. డబులింజన్​ సర్కారు ఉంటే అక్కడా, ఇక్కడా మోదీయో ఉంటారు. గిరిజన యూనివర్సిటీకి 10 ఏండ్లుగా కేసీఆర్​ సర్కారు స్థలం ఇవ్వలేదు. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు కూడా ఏర్పాటు కాబోతోంది. కృష్ణా జలాల వాటా కోసం ట్రిబ్యునల్​ ఏర్పాటు చేసింది మోదీయే’’ అని అమిత్​షా అన్నారు.

చట్టసభల్లో మహిళలకు 33శాతం వాటా..

‘‘చట్టసభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లను మోదీ తీసుకొచ్చారు. 10 ఏండ్లలో పేదల కోసం కేసీఆర్​ ప్రభుత్వం పనిచేయలేదు. కేటీఆర్​ను సీఎం ఎలా చేయాలన్నదే కేసీఆర్​ ఆలోచించారు. కేసీఆర్​ కేవలం తన కుటుంబం కోసమే పనిచేశారు. 75 ఏండ్ల దేశ చరిత్రలో తొలిసారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేశాం. ఎన్నికలు రాగానే కొత్త దుస్తులు వేసుకుని కాంగ్రెస్​ నేతలు వస్తారు. పేదల గురించి మాట్లాడడం తప్ప వాళ్లకు కాంగ్రెస్​ చేసిందేమీ లేదు. ఇచ్చిన ఏ హామీని కేసీఆర్​ అమలు చేయలేదు. గిరిజనులకు ఎన్నో హామీలిచ్చారు. అందులో ఒక్కటీ కూడా అమలు చేయలేదు”అని అమిత్​షా ధ్వజమెత్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement