Thursday, May 26, 2022

ఊళ్లోకి వచ్చి, చెట్టుమీద కూర్చున్న చిరుతపులి.. భయాందోళనలో గ్రామస్తులు

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి గ్రామీణ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోంది. ఈరోజు ఓ గ్రామంలో చెట్టుపైకి ఎక్కి గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. సమీపంలోని అడవుల నుంచి చిరుత తప్పిపోయిందని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) పర్వేజ్ రుస్తమ్ తెలిపారు. కాగా, ఇవ్వాల మహ్మద్‌పూర్‌లోని బసేరా గ్రామంలో ఓ చెట్టు ఎక్కింది ఆ చిరుత. ఆ చిరుతను రక్షించేందుకు నాలుగు రేంజర్లతోపాలుఅటవీ శాఖ బృందాలు, పలు పోలీస్ స్టేషన్ల నుంచి బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గ్రామస్థులు కూడా చెట్టును చుట్టుముట్టారు. భూమి నుండి సుమారు 30 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టుపై ఈ చిరుతపులి కూర్చుని వీడియో  తీసి షేర్​ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement