Monday, April 29, 2024

Flash: చిన్నారుల చేతిలో పేలుడు పదార్థాలు…

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవడా జిల్లాలోని చిన్నారులు పేలుడు పదార్థాలతో ఆడుకోవడం అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గడువు తీరిన, గన్ పౌడర్ లేని 350  పేలుడు పదార్థాలను పోలీసులు దంతెవాడ జిల్లాలోని పొలాల్లో పడేసారు. ఆ పొలాల్లో లభించే మహువ, టెండ్ ఆకులను సేకరించిందేకు వెళ్లిన కూలీల పిల్లలు అక్కడి పేలుడు పదార్థాలతో ఆడుకుంటున్నారు. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ అంశంపై అక్కడి సామాజిక కార్యకర్త భేలా భాటియా కూడా ఆందోళన చేపట్టడంతో దంతేవాడా ఎస్పీ సిద్దార్థ్ తివారి వివరణ ఇచ్చారు. పంట పొలాల్లో ఉన్న పేలుడు పదార్థాలు గడువు తీరినవని, వాటిలో గన్ పౌడర్ లేదని స్పష్టం చేశారు. వీటి వలన ఎలాంటి ఇబ్బంది కానీ ప్రమాదం కానీ లేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement