Friday, May 17, 2024

Breaking: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర కేసులో కీలక విషయాలు

టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర పన్నిన కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకొచ్చాయి. నాందేడ్ లో రూ.32వేలకు పిస్టల్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రసాద్ తో పాటు స్నేహితులు, డీలర్ సంతును టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బేగంబజార్ లో ప్రసాద్ బొమ్మ తుపాకీని కొనుగోలు చేశాడు. అయితే జీవన్ రెడ్డికి ఇంటికి ప్రసాద్ తుపాకీతోనే వెళ్లాడని తెలిపారు. ఎమ్మెల్యేను కలవాలని చెప్పడంతో సెక్యూరిటీ లోపలికి అనుమతించారు. జీవన్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రసాద్ యత్నించాడు. దీంతో ఎందుకు వచ్చావని ప్రసాద్ ను ఎమ్మెల్యే బయటకు పంపాడన్నారు. దీంతో ప్రసాద్ గౌడ్ జీవన్ రెడ్డితో వాగ్వాదానికి దిగాడని తెలిపారు. ప్రసాద్ గౌడ్ పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేయిచేసుకోవడంతో సిబ్బంది అప్రమత్తమై ప్రసాద్ గౌడ్ ను నెట్టివేశారన్నారు. అదే సమయంలో ప్రసాద్ దగ్గర తుపాకీ గుర్తించారన్నారు. సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే ప్రసాద్ ను బంధించినట్లు తెలిపారు. ప్రసాద్ గతంలో మావోయిస్టు సానుభూతిపరుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement