Wednesday, May 1, 2024

Exit Polls | కాంగ్రెస్​కే ఆధిక్యం.. కన్నడ ఓటర్​ నాడీపై అంచనాలివే!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక ఇప్పుడు అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాల్లో పార్టీలు తలమునకలయ్యాయి. ఆయా వెబ్​సైట్లు, టీవీ చానళ్లు స్పెషల్​ డిబేట్​ నిర్వహిస్తుండగా.. కొన్ని మీడియా సంస్థలు ఎగ్జిట్​ పోల్స్​ని వెలువరించాయి. ఈ అంచనాలన్నీ పరిశీలిస్తే.. కర్నాటకలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవినీతి మకిలీ అంటుకుని, 40% కమిషన్​ అన్న అపవాదుతో ఎన్నికల్లో దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీని కన్నడ ప్రజలు ఆదరించలేదని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షా వంటి మహా మహులు వచ్చినా ఓటర్లు పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో బీజేపీ ఈ ఎన్నికల్లో రెండో స్థానం దక్కించుకోవచ్చని అంచనాలున్నాయి.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

  • TV9 Bharatvarsh-Polstrat ఎగ్జిట్ పోల్ వివరాల ప్రకారం.. కాంగ్రెస్ 38.9 శాతం ఓట్లతో దాదాపు 99 నుండి 109 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీకి దాదాపు 88-98 ఓట్లు రావచ్చనే అంచనాలున్నాయి.
  • ఇక.. జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) కేవలం 21-26 ఓట్లతో మూడో స్థానంలో వెనుకంజలో ఉండబోతున్నట్టు సర్వే చెబుతోంది.
  • కాగా, టీవీ9 కన్నడ-సి ఓటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. కాంగ్రెస్ దాదాపు 100-112 సీట్లు సాధిస్తుందని, కాషాయ పార్టీకి 83-95 ఓట్లు వస్తాయని అంచనా ఉంది.
  • ఏషియానెట్ సువర్ణ న్యూస్-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ కర్నాటకలో హంగ్ తీర్పును అంచనా వేస్తోంది. కాంగ్రెస్ దాదాపు 91-106 ఓట్లు, బీజేపీకి దాదాపు 94-117 ఓట్లు వస్తాయన్న అంచనాలున్నాయి.
  • జీ మ్యాట్రిజ్ కూడా కర్నాటకలో హంగ్ రావచ్చని అంచనా వేస్తోంది.
  • అదే విధంగా.. రిపబ్లిక్ కూడా కర్నాటకలో ఇదే పరిస్థితిని అంచనా వేస్తోంది. బీజేపీకి 85-100 సీట్లు, కాంగ్రెస్‌కు 94-108 సీట్లు వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.
  • ABP News-C Voter కాంగ్రెస్‌కు 81-101 సీట్లు, బీజేపీకి దాదాపు 66-86 స్థానాలతో స్పష్టమైన మెజారిటీని రావొచ్చని అంచనా వేసింది. మరోవైపు నవభారత్ కర్నాటకలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని స్పష్టం చేస్తోంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement