Friday, April 26, 2024

క‌పిల్ దేవ్ గా అల‌రించిన ర‌ణ్ వీర్ సింగ్ .. అదిరిన 83 ట్రైల‌ర్ ..

స్టార్ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ జీవిత చ‌రిత్ర‌పై 83పేరుతో ఓ చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో క‌పిల్ దేవ్ లా మెర‌వ‌నున్నాడు స్టార్ హీరో ర‌ణ్ వీర్ సింగ్. ఈ చిత్రాన్ని క‌బీర్ ఖాన్ రూపొందిస్తున్నాడు. డిసెంబ‌ర్ 24న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పించేలా అదిరిపోయింది. అసలు అంచనాలే లేకుండా, మీడియా నుంచి విదేశీయుల నుంచి హేళనకు గురవుతూ టీమిండియా జగజ్జేతగా ఎలా అవతరించింది అనేది ఈ చిత్ర కథ.

కపిల్ దేవ్ టీమిండియాని తన భుజాలపై ఎలా నడిపించాడు అనే అంశాలని దర్శకుడు కబీర్ సింగ్ ఆసక్తికరంగా చూపించబోతున్నారు. క‌పిల్ పాత్ర‌లో ర‌ణ్ వీర్ ఒదిగిపోయాడు.. ఈ చిత్రంలో హీరోయిన్ , ర‌ణ్ వీర్ భార్య దీపిక కూడా న‌టిస్తుంది. మ‌రి ఈ చిత్రం ఏ మేర‌కు విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement