Tuesday, October 8, 2024

ఏఎంబీ సినిమాస్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ చూసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ

నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయింది ఆర్ ఆర్ ఆర్ చిత్రం. కాగా ఈ మూవీకి అదిరిపోయే రివ్యూలు వ‌స్తున్నాయి. కాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఈ చిత్రాన్ని వీక్షించాడు. తన భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి సినిమా చూశాడు. ఎన్టీఆర్ కుటుంబం, ఆయన సన్నిహితుల కోసం ప్రత్యేక షో వేశారు.ఈ ప్రివ్యూకి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. సినిమా పూర్తయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన జూనియర్… ‘సినిమా సూపర్’ అనే విధంగా థంబ్స్ అప్ చూపించాడు. తారక్ ఎంతో హ్యాపీగా కనిపించాడు. ఆయన రియాక్షన్ చూస్తుంటే… ఇండియన్ సినిమా రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement