Saturday, September 21, 2024

James Webb Space Telescope: వీడనున్న ఖగోళ రహస్యాలు.. టెలిస్కోప్ విశేషాలు ఇవీ..

ప్రపంచంలోనే అతిపెద్ద ‘జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌’ను నాసా అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. గయానా స్పేస్ సెంటర్ నుంచి యూరప్ అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్-5 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. ఈ టెలిస్కోపు రాకెట్‌ను భారత కాలమానం ప్రకారం సరిగ్గా శనివారం(డిసెంబర్ 25) సాయంత్రం 5.50 గంటలకు ఎరియాన్ 5 రాకెట్ విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. నింగిలోకి దూసుకెళ్లిన ఈ టెలిస్కోపు 1.6 మిలియన్ కిలో మీటర్ల దూరంలో ఉన్న గమ్యానికి చేరుకోడానికి వివిధ దశలను దాటుకుని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించడానికి దాదాపు నెల రోజులు పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చంద్రగోళం కన్నా నాలుగు రెట్లు దూరంలో ఈ గమ్యం ఉంది. 70 అడుగుల పొడవు, 46 అడుగుల వెడల్పు ఉన్న ఈ టెలిస్కోప్ టెన్నిస్ కోర్టు అంత సైజు ఉంటుంది. ఐదు పొరల సన్‌షీల్డ్ రక్షణ కవచంతో కాంతిని గ్రహించే దర్పణంతో వేడిని గ్రహించ గలిగే ఇన్‌ఫ్రారెడ్ డిటెక్టర్లతో దీన్ని రూపొందించారు.

ఖగోళశాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు జవాబులు కనుగొనే దిశగా ప్రయాణం ప్రారంభించిన ఈ టెలిస్కోప్ రాకెట్ 5 నుంచి 10 ఏళ్ల పాటు సేవలు అందించనున్నది. అమెరికా, ఐరోపా, కెనడా, అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా రూ. 73 వేల కోట్ల తో దీన్ని రూపొందించాయి. వినూత్న పరిజ్ఞానం, భారీ వ్యయప్రయాసలతో రూపొందిన ఈ అత్యాధునిక టెలిస్కోపు అందించబోయే డేటా వెలుగు లోకి తెచ్చే సరికొత్త విషయాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జేమ్స్ వెబ్‌స్పేస్ టెలిస్కోప్ విశేషాలు

కంటికి కనిపించని నక్షత్రాలను 1,000 కోట్ల రెట్ల క్లారిటీతో చూడవచ్చు. అంతరిక్షంలోకి పంపిన అతిపెద్ద టెలిస్కోప్ ఇదే. హబుల్ టెలిస్కోప్ కంటే రెండున్నర రెట్లు పెద్దది. 100 రెట్ల క్లారిటీతో ఫొటోలు తీస్తుంది. 21 అడుగుల పొడవైన ఈ టెలిస్కోప్ తయారీకి రూ.75,000 కోట్ల ఖర్చు చేశారు. నాసా, యూరోపియన్, కెనడా స్పేస్ ఏజెన్సీలు కలిసి దీన్ని అభివృద్ధి చేశాయి. దీన్ని నాసా అంతరిక్షంలోకి పంపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement