Thursday, May 26, 2022

ఇట్లు మారేడు మిల్లిప్ర‌జానీకం – ఫ‌స్ట్ లుక్ రిలీజ్

ఏఆర్ మోహ‌న్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతోన్న చిత్రం ఇట్లు మారేడు మిల్లి ప్ర‌జానీకం. ఈ చిత్రంలో హీరోగా అల్ల‌రి న‌రేష్ న‌టించాడు. కాగా అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా గురించి మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. అల్లరి నరేష్ 59 వ చిత్రం గా వస్తున్న ఈ మూవీని హాస్య మూవీస్ .. జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా నాంది చిత్రం తో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు హీరో అల్లరి నరేష్.ప్రస్తుతం ఆయన చేతిలో మరో సినిమా ఉంది.అదే “సభకు నమస్కారం” ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement