Friday, April 26, 2024

‘గుడ్ ల‌క్ సఖి’ లక్ష్యం నెరవేరేనా..!?

జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. క్రీడల నేపథ్యంలో, లేడీ ఓరియంటెడ్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం రూపొందింది.

‘గుడ్‌ లక్‌ సఖి’ థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. దేశంలో టాప్‌ షూటర్లను తయారు చేస్తానని జగపతిబాబు ప్రకటించడంతో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. బ్యాడ్‌లక్‌ సఖిగా కీర్తి సురేష్‌ పరిచయం అవుతుంది. అయితే కీర్తి పేరును జగపతిబాబుకు సూచిస్తాడు ఆది పినిశెట్టి. ఇంతలో షూటింగ్‌ మహిళల కోసం కాదు అని గ్రామస్తులు దీనిని వ్యతిరేకిస్తారు. దాంతో సఖి మళ్లీ దురదృష్ట వంతురాలు అని నిరూపించుకుంటుంది. ఫస్ట్‌ టైమ్‌ ఆమె టార్గెట్‌ రీచ్‌ అవడంలో ఫెయిల్‌ అవుతుంది. అయితే జగపతి బాబు ఆమెను లక్ష్యాన్ని చేరుకునె విధంగా ప్రేరేపిస్తారు. స్ఫూర్తిదాయకమైన కంటెంట్‌ తో ట్రైలర్‌ ఆకట్టుకుంది. అన్ని కమర్షియల్‌ అంశాలను చేర్చి సినిమాగా మలిచాడు దర్శకుడు నగేష్‌ కుకునూర్‌. ‘గుడ్‌ లక్‌ సఖి’ సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొంది స్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. జనవరి 28న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement