Friday, May 3, 2024

Spl Story: ఇరిటేటింగ్​ ఉబర్​ సర్వీస్.. లాంగ్​ పికప్స్​తో నష్టపోతున్న డ్రైవర్​ పార్టనర్స్

హైదరాబాద్​, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి పెద్ద పెద్ద నగరాల్లో జర్నీ చేయాలంటే సమయానికి సిటీ బస్సులు ఉండవు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన అమెరికన్​ మొబిలిటీ సర్వీస్​ ప్రొవైడర్​ అయిన ఉబర్​ కంపెనీ ప్రయాణికులకు కొంత ఊరట కలిగించింది. ఆ సంస్థ ప్రవేశపెట్టిన యాప్​ బేస్డ్​ సర్వీస్​తో క్షణాల్లో కారు ఇంటికి వస్తుంది. దీంతో ఎక్కడికంటే అక్కడికి బుక్​ చేసుకుని జర్నీ చేసే వెసులుబాటు ఏర్పడింది. కానీ, ఈమధ్య కాలంలో ఉబర్​ తీసుకున్న నిర్ణయాలు అటు రైడర్లను, ఇటు డ్రైవర్​ పార్టనర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో వారు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఉబర్​ యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు, కంప్లెయింట్స్​ వస్తున్నాయి. వెహికల్​ బుక్​ చేసిన తర్వాత వెంటనే రావడం లేదని, గమ్యస్థానం తెలుసుకుని బుకింగ్​ క్యాన్సిల్​ చేస్తున్నారన్న కంప్లెయింట్స్​తోపాటు ఏసీ ఆన్​ చేయడం లేదనేది మరో అతిపెద్ద సమస్యగా మారింది. ఇట్లాంటి కంప్లెయింట్స్​ని పరిష్కరించడానికి ఉబర్​ సంస్థ మార్చిలో మొట్టమొదటి ఉబర్​ డ్రైవర్​ సలహా మండలి సమావేశం నిర్వహించింది. దీనిలో చర్చించిన మీదట ఉబర్​ డ్రైవర్స్​, పార్టనర్స్​కి ఎట్లాంటి నష్టం కలగకుండా కొన్ని చర్యలను తీసుకుంటున్నట్టు ఉబర్​ ప్రకటించింది.

డ్రైవర్లు ట్రిప్పులను రద్దు చేయడం, ఏసీని ఆన్ చేయకూడదనుకోవడంపై రైడర్లు ఫిర్యాదు చేయడంతో నిబంధనలను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్‌లు చాలా అసంతృప్తిగా ఉన్నప్పటికీ అధిక ఇంధన ధరలు, సుదూర పిక్-అప్‌లు.. చెల్లింపు షెడ్యూల్‌ల నేపథ్యంలో డ్రైవర్లు కూడా ఆదాయాల గురించి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పెరుగుతున్న ఇంధన ఖర్చులే దీనికి కారణంగా తెలుస్తోంది.

కంపెనీ తెలిపిన ప్రకారం.. ఇంధన ధరల పెంపు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపింది.ముఖ్యంగా రైడ్‌షేరింగ్ డ్రైవర్లు పెరుగుతున్న ఇంధన ధరలను భారంగా భావిస్తున్నారు.డ్రైవర్​ సలహా మండలిలో చర్చించిన మీదట కౌన్సిల్‌లో డ్రైవర్ సభ్యులు అధిక ఇంధన ధరల ప్రధాన సమస్యను లేవనెత్తారు. దేశంలోని అనేక నగరాల్లో పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం నుండి డ్రైవర్లనుకాపాడడానికి కంపెనీ కొన్ని వారాలుగా Uber చార్జీలను పెంచింది.

డ్రైవర్లపై వచ్చిన  ఫిర్యాదులలో మరొకటి ఏంటంటే వారు ఎక్కువ దూరంలో పికప్​లను తీసుకోవడం లేదు. దీన్ని పరిష్కరించడానికిరైడర్‌లను పికప్ చేసుకోవడానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు కంపెనీ ఇప్పుడు డ్రైవర్లకు అదనపు ఆదాయాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. కొత్త సిస్టమ్ ప్రకారండ్రైవర్లు ఎక్కువ టైమ్​ పిక్-అప్‌ల కోసం వెయిట్​ చేయకుండా వెసలుబాటు కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడుబుక్​ చేసుకున్న వారికి కావల్సిన టైమ్​లో రైడ్ వచ్చేలా ఇది సహాయపడుతుంది. కస్టమర్‌కు బాధ కలిగించే లాంగ్​ పిక్-అప్ ఈజీగా తీసుకోవడానికి డ్రైవర్‌లకు ప్రోత్సాహాన్ని అందించాలనే ఆలోచన ఉబర్​ కంపెనీ చేస్తోంది.

- Advertisement -

ఇక.. దేశవ్యాప్తంగా డ్రైవర్ల నుండి తరచుగా వినిపించే వాటిలో మరొక అంశం ఏంటంటే.. ఆన్​లైన్​ పేమెంట్​ కాకుండా క్యాష్​ పేమెంట్​ చేయాలి అని..  దీన్ని పరిష్కరించడానికి ఉబెర్ రోజువారీ చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది సోమవారం నుండి గురువారం వరకు ట్రిప్ ఆదాయాలు శుక్రవారం డ్రైవర్‌లకు క్రెడిట్ చేసేలా ఉంటుందని తెలిపింది. అయితే శుక్రవారం నుండి ఆదివారం వరకు వచ్చే ఆదాయాలు సోమవారం క్రెడిట్ అవుతాయని ఉబర్​ ప్రతినిధులు తెలిపారు.

కాగా, Uber యాప్ లో చేసిన అప్​డేట్స్​ ప్రకారం.. ఇప్పుడు ట్రిప్ ప్రారంభమయ్యే ముందు డ్రైవర్‌లకు చెల్లింపు విధానాన్ని (నగదు లేదా ఆన్‌లైన్) చూపుతుంది. ఇది కంపెనీ రూల్స్​ ప్రకారం డ్రైవర్‌కి కావాలంటే నగదు రైడ్‌ని మాత్రమే ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement