Friday, March 1, 2024

రఘునందన్ వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం..

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజులరామారం పోలీస్ స్టేషన్ కు బండి సంజయ్ ను చూసేందుకు వచ్చిన రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ… పోలీసుల తీరును ఎండగట్టారు. పనిలో పనిగా తెలంగాణలో బీహార్ పాలన కొనసాగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ కు చెందిన అంజనీకుమార్ డీజీపీగా ఉండడం వల్లే ఆ సంస్కృతి తెలంగాణలో కొనసాగుతుందంటూ తీవ్రపదజాలంతో విమర్శించారు.

తన మీడియా సమావేశంలో పదేపదే అంజనీకుమార్ పనితీరును తప్పుబట్టారు. కాగా రఘునందన్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బాధ్యతాయుత పదవిలో ఉన్న రఘునందన్ డీజీపీపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరమని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement