Sunday, May 5, 2024

ఆపిల్​ ఫోన్లపై ​ఆఫర్లు వర్షం.. 31వేలకే ఐఫోన్​ 11 కొనొచ్చు.. ఎలా అంటే..

ఐఫోన్‌లపై ఆఫర్ల వర్షం కురుస్తోంది.. మీరు కనుక స్మార్ట్​ ఫోన్​ కొనాలని ప్లాన్ చేస్తుంటే Amazonలో బెస్ట్​ డీల్స్​ ఉన్నాయి ఒకసారి చెక్​ చేసుకోండి.. ఐఫోన్ 11ని అమెజాన్‌లో రూ.4000 తగ్గింపుతో విక్రయిస్తోంది. ఈ డీల్‌ను మరింత తగ్గించడానికి అమెజాన్ కూడా రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్​ని ప్రకటించింది.  కాగా, ఐఫోన్ 11 2019 సెప్టెంబర్ లో రిలీజ్​ అయ్యింది.

ఐఫోన్ 11, 64GB వేరియంట్ కోసం 68,300కు ఇండియాలో అమ్ముతోంది. అయితే, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో రూ.49,900కి లభిస్తోంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ICICI బ్యాంక్, SBI క్రెడిట్ కార్డ్ పై రూ. 4000 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. ఇంకా, కొనుగోలుదారులు తమ పాత ఫోన్‌కు బదులుగా రూ. 15,000 వరకు ఎక్చేంజ్​  పొందవచ్చు. దీంతో ధర కాస్త రూ.31,000కు తగ్గనుంది. మీ పాత ఫోన్ యొక్క ఎక్స్ఛేంజ్ విలువ ఫోన్ పరిస్థితి, ఫోన్ తయారు చేసిన సంవత్సరంపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. స్మార్ట్ ఫోన్ పరిస్థితి బాగుంటే కనుక ఇంకాస్త బెస్ట్​ ప్రైస్​ని పొందే చాన్స్​ ఉంటుంది.

ఉదాహరణకు.. మీరు మీ iPhone XR 64GB ఫోన్​ని ఎక్చేంజ్​ చేయాలనుకుంటే..  రూ. 12,000 వరకు పొందవచ్చు. అదేవిధంగా మీ పాత iPhone 11ని చేంజ్​ చేసి, కొత్త ఫోన్​ కొనాలనుకుంటే బెస్ట్​ ప్రైజ్​ లభిస్తుంది.

Flipkart కూడా iPhone 11 కోసం ఇదే విధమైన డీల్‌ను అందిస్తోంది. Walmart యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లాట్ తగ్గింపును అందించనప్పటికీ ఇది రూ. 18,850 ఎక్చేంజ్​ ఆఫర్​ని అందిస్తోంది. తద్వారా ధర కూడా రూ.31,000కి తగ్గే చాన్స్​ ఉంటుంది.

ఐఫోన్ 11 ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్‌లలో ఒకటి. మొదటిసారి ఐఫోన్ కొనుగోలు చేసేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే..  మీరు iPhone 11ని కొనుగోలు చేసే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

- Advertisement -

స్మార్ట్ ఫోన్ 120Hz డిస్‌ప్లేతో రాదు.  5Gకి సపోర్ట్​ చేయదు అన్న విషయం గమనించాలి.  కానీ, ఇక్కడో క్వశ్చన్​ ఏంటంటే.. నిజంగా 5G నెట్​వర్క్​, అధిక రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లే అవసరమా ? అన్నది కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది.  అట్లాంటప్పుడు ఐఫోన్ 12ని కొనుగోలు చేయడం వల్ల ఫ్యూచర్​లో బెటర్​గా ఉంటుంది. కాగా, ఇండియాలో 5G నెట్​వర్క్​ రావడానికి ఇంకా చాలా ఏళ్లు పట్టొచ్చని తెలుస్తోంది.  కనీసం ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఐఫోన్​ కొనాలనుకుంటే మట్టుకు 2021లో వచ్చిన ఐఫోన్ 11 ఫోన్​ బెస్ట్​ ఆప్షన్​గా ఎంచుకోవచ్చు.  బడ్జెట్ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది.  ఈ ఫోన్​కి ఆపిల్​ నుంచి 2025వరకు అప్​డేట్స్​ వస్తాయన్న విషయం కూడా గమనంలోకి తీసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement