Monday, April 29, 2024

Sports | చరిత్ర సృష్టించిన భారత బాక్సర్లు.. వ‌ర‌ల్డ్ చాంపియన్‌షిప్‌లో మూడు మెడల్స్‌

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు రికార్డు సృష్టించారు. మెగా టోర్నీలో మూడు పతకాలు ఖాయం చేశారు. తొలిసారి ముగ్గురు ప్లేయర్లు సెమీస్‌ చేరడం ఇదే తొలిసారి. దీపక్‌ భోరియా (51కేజీలు), మహ్మద్‌ హుస్సాముద్దీన్‌ (57కేజీలు), నిశాంత్‌ దేవ్‌ (71కేజీలు) బుధవారం సెమీఫైనల్‌కు చేరుకున్నారు. తద్వారా దేశానికి కనీసంగా కాంస్య పతకమైనా సాధించడం ఖాయమని తేల్చారు. గతంలో 2019లో మనిష్‌ కౌషిక్‌, అమిత్‌ పాన్‌ఘల్‌ రెండు పతకాలతో రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు ఆ రికార్డును ఈ త్రయం బ్రేక్‌ చేశారు.

మొదటి క్వార్టర్‌ ఫైనల్‌లో, కిర్గిస్తాన్‌కు చెందిన డిషెబీవ్‌ నుర్జిగిత్‌పై దీపక్‌ 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టాడు. మొదటి రౌండ్‌ నుంచే భారత బాక్సర్లు వేగంగా కదులుతూ, రింగ్‌లో ఆధిపత్యం చెలాయించారు. హోరాహోరీగా జరిగిన మరొక మ్యాచ్‌లో హుసాముద్దీన్‌ 4-3 తేడాతో బల్గేరియా బాక్సర్‌ జె డియాజ్‌ ఇబానెజ్‌ను ఖంగుతినిపించి మరొక పతకం ఖాయం చేశాడు. మూడవ క్వార్టర్‌ ఫైనల్‌లో క్యూబా బాక్సర్‌పై నిశాంత్‌ దేవ్‌ 5-0తో సంపూర్ణ ఆధిక్యంతో గెలుపొంది సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నాడు. శుక్రవారం జరిగే సెమీస్‌లో ఆసియా చాంపియన్‌ కజకిస్తాన్‌ బాక్సర్‌ అస్లాన్‌బెక్‌తో నిశాంత్‌ తలపడనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement