Tuesday, November 28, 2023

ఇమ్రాన్ కు మోదీ లేఖ

పాకిస్థాన్​ డే సందర్భంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు లేఖ రాశారు. పాక్​ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ తో స్నేహపూర్వక సంబంధాలను తాము కోరుకుంటున్నామని, ఇదే సమయంలో ఆ సంబంధాలు నమ్మకమనే పునాదులపై నిలబడి వుండాలని మోదీ అన్నారు. తొలుత పాకిస్థాన్ ఉగ్రవాదానికి దూరం కావాల్సి వుందని మోదీ కోరారు. ‘పాకిస్థాన్ డే’ సందర్భంగా ఆ దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖను పంపారు.

కాగా, ఈ లేఖ ప్రతి సంవత్సరమూ పంపించే రొటీన్ లెటర్ మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొద్ది రోజుల క్రితమే కరోనా బారిన పడిన ఇమ్రాన్​ ఖాన్​.. ​ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్​లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement