Monday, June 24, 2024

దేశంలో కొత్తగా 50 వేల కరోనా కేసులు..

దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల వద్దే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్త 50,040 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కు చేరింది. ఇందులో 2,92,51,029 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,86,403 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 3,95,751 మంది మహమ్మారి వల్ల మరణించారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 1,258 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 57,944 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారని తెలిపింది. దీంతో దేశంలో కరోనా రికవరీ రేటు 96.75 శాతానికి పెరిగిందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement