Thursday, April 18, 2024

ఆస్తులు కాపాడుకోవటం కోసమే బీజేపీలోకి ఈటల: హరీశ్‌రావు

ఈటల రాజేంధర్ తన ఆస్తులు కాపాడుకోవడానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టి బీజేపీలో చేరారని విమర్శించారు మంత్రి హారీష్ రావు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నిక తర్వాత హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్ నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఇక కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement