Sunday, April 28, 2024

హుజురాబాద్లో గులాబీ ట్రబుల్ షూటర్.. ఆ ఫార్ములా పని చేస్తుందా?

తెలంగాణ రాజకీయాలు హుజురాబాద్ కేంద్రంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్‌ను ఒడించాలని బీజేపీ… కాషాయ పార్టీని దెబ్బ తీసి ఈటలకు బుద్ది చెప్పాలని గులాబీ సైన్యం.. ఇలా ప్రణాళికలు రచిస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా హుజురాబాద్ లో గెలవడం టీఆర్ఎస్‌ పార్టీకి అత్యంత కీలకం. అది సిట్టింగ్ స్థానం కావడంతో గులాబీ దళం అంతా హుజురాబాద్‌లోనే మకాం వేసింది. ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసినప్పటి నుంచే నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. ఈటల పార్టీ నుంచి వెళ్లడం ఖాయమని ముందే గ్రహించిన గులాబీ పార్టీ.. ఆయనను ఏకాకి చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ఈటల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు ట్రబుల్ షూటర్ అయిన మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. ఈటల రాజేందర్ పార్టీని నుంచి బహిష్కరించిన తర్వాత కేడర్‌ చేజారకుండా జాగ్రత్తపడుతోంది. ఇదే క్రమంలో టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూర చేసింది. మాజీ మంత్రిని ఒంటరిని చేసందుకు ఇన్నాళ్లూ లోకల్ కేడర్‌తో మీటింగ్‌లు జరిపింది. ఇప్పుడు ఏకంగా ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగడంతో హుజురాబాద్ రాజకీయం వేడెక్కింది.

టీఆర్ఎస్ లో హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయన తనకు అప్పగించిన పనిని సమర్థంగా నిర్వహిస్తారనే విశ్వాసం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కు ఉంది. పలు ఎన్నికల్లో ఆయన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆదేశాలతో హుజురాబాద్ సీన్‌లోకి ఎంటరైన హరీష్‌… తన పనిని మొదలు పెట్టారు. హుజురాబాద్‌ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. కేసీఆర్‌ ఆదేశాలతో హుజురాబాద్‌ అభివృద్ధి, క్యాడర్‌పై మానిటరింగ్‌ నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తామని చాలా మంది నేతలు హరీష్ రావుకు హామీ ఇస్తున్నారు.

హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ దే గెలుపు అని ఆపార్టీ నాయకులు అంటున్నా.. ఈటలను ఓడించడం అంత సులువైన పని కాదు. నియోజకవర్గంలో ఈటలకు మంచి పట్టుంది. ఆరు సార్లు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారు. గతంలో సెంటిమెంట్‌తో గెలిచినా.. తనపై కుట్రలు చేశారని, తనకు అన్యాయం జరిగిందంటూ ప్రజల్లో సానుభూతి పొందుతున్నారు. ఈ క్రమంలో అలర్ట్ అయిన గులబీ సైన్యం… ఒక్కొక్కరుగా హుజురాబాద్‌లో దిగుతున్నారు. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు ఈటలపై సైలెంట్‌గా ఉన్న హరీష్.. తన విమర్శలుకు పదును పెట్టారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని హరీష్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నిక తర్వాత హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్ నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఈటల తన ఆస్తులు కాపాడుకోవడానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టి బీజేపీలో చేరారని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కు ఈటల రాసిన లేఖ నిజమైందే: బాల్క సుమన్

Advertisement

తాజా వార్తలు

Advertisement